PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుట్ట‌ప‌ర్తి జిల్లా కంబాలపర్తి వద్ద వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీదర్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నల్లమాడ మండలానికి ఎమ్మెల్యే వెళ్తుండగా.. కంబాలపర్తి వద్ద పాము రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దీంతో వాహన డ్రైవర్‌ సడెన బ్రేక్‌ వేయడంతో కాన్వాయ్‌లో వెనుక వైపు వస్తున్న మరో వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక వైపు బలంగా ఢీకొంది. కారు వెనుక వైపు నుజ్జునుజ్జు అయింది. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. మరో వాహనంలో ఎమ్మెల్యే వెళ్ళిపోయారు.

                                                  

About Author