దాహం తీర్చుకునేందుకు వచ్చి..
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: అటవీ ప్రాంతం నుంచి దాహం తీర్చుకునేందుకు ఓ జింక (దుప్పి)ను కుక్కలు వెంబడించగా స్థానికులు రక్షించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం మహానంది పట్టణంలోని ఈశ్వర్నగర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు జింకను అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ముత్తుజాకు అప్పగించారు. వేసవి తాపం తాళలేక.. అడవిలోని జంతువులు దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. అడవిలో అక్కడక్కడ గుంతలు ఏర్పాటు చేసి నీటిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరారు.