రికార్డు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతతో శుక్రవారం భారత సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1534 పాయింట్ల లాభంతో 54326 వద్ద, నిఫ్టీ 456 పాయింట్ల లాభంతో 16266 వద్ద ముగిసింది. రెడ్డీస్ ల్యాబ్, రిలయన్స్, జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటామోటార్స్, నెస్లే కంపెనీలు టాప్ గెయినర్స్ గా మిగిలాయి. శ్రీసిమెంట్, యూపీఎల్ కంపెనీలు టాప్ లూజర్స్ గా నిలిచాయి.