PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలిక పై స్కూల్ క‌రస్పాండెంట్.. దారుణం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాకినాడ‌లో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ స్కూల్‌ కరస్పాండెంట్‌ కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతుండడంతో బాలిక గర్భవతి అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ కొండయ్యపాలెం రామాలయం ప్రాంతంలో ఉన్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో స్థానిక గొడారిగుంటకు చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆ స్కూల్‌కు చెందిన వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. బాలికపై కన్నేసిన స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ గత కొంత కాలంగా బాలికను భయపెట్టి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అనంతరం అబార్షన్‌ అయినట్లు గుర్తించారు. గైనిక్‌ విభాగంలోని ఎస్‌ఎల్‌ఆర్‌ వార్డులో బాలికకు ప్రత్యేక వైద్య చికిత్సలను అందిస్తున్నారు. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

                                    

About Author