ప్రవక్త పై బీజేపీ నేత వ్యాఖ్యలు… ఆగ్రహించిన గల్ఫ్ దేశాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ లీడర్లు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల సంఖ్య పెరిగింది. ఖతర్, కువైట్, బహ్రైన్, ఇరాన్ దేశాల జాబితాలో తాజాగా గల్ఫ్ పెద్దన్న సౌదీఅరేబియా కూడా చేరింది. బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తున్నట్టు సౌదీ విదేశాంగ శాఖ శాఖ అధికారికంగా ఆక్షేపించింది. విశ్వాసాలు, మతాలకు గౌరవమివ్వాలని ఈ సందర్భంగా సౌదీ పిలుపునిచ్చింది. నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ తీసుకున్న చర్యలను సౌదీ స్వాగతించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.