అసెంబ్లీ రద్దు చేస్తా .. దమ్ముంటే రండి !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పై విరుచుకుపడ్డారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ‘‘బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. అందరం ఎన్నికలకు పోదాం. ఇలాంటి చిల్లర మాటలతోని కేసీఆర్ను కొడతారా? దెబ్బతీస్తారా? ఇంత కురచ ఆలోచనా? ఇది మంచిది కాదు. ఒకవేళ ముందస్తుకు పోతే కేసీఆర్ను తట్టుకుంటారా? కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వస్తే.. రైతుబంధు, దళితబంధు ఇస్తానని ప్రజలకు చెప్తాడు. ‘అదే జరిగితే మన కొంప మునుగుతది’ అని బీజేపీ భయపడుతోంది’’.. అని సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు.