PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గొట‌బ‌య రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు. అంతా ఊహించినట్టే మాల్దీవుల నుంచి గురువారం సాయంత్రం సింగపూర్‌కు చేరుకున్న ఆయన.. పార్లమెంటు స్పీకర్‌ మహింద యప అబెవర్దనేకు తన రాజీనామా లేఖను అక్కడి శ్రీలంక హైకమిషన్‌ ద్వారా ఈమెయిల్‌లో పంపారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం ధ్రువీకరించింది. అయితే, ఇలా మెయిల్‌ ద్వారా పంపిన లేఖ చట్టపరంగా ఆమోదయోగ్యమా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్న స్పీకర్‌ కార్యాలయం.. ఈ విషయాన్ని ధ్రువీకరించుకుని, శుక్రవారం లాంఛనంగా ప్రకటిస్తామని తెలిపింది. రాజపక్స రాసిన రాజీనామా లేఖ అసలు ప్రతిని సింగపూర్‌ నుంచి కొలంబోకు తెప్పించుకుని, అందులో ఆయన సంతకాన్ని పరిశీలించాలని స్పీకర్‌ భావిస్తున్నట్టు వి శ్వసనీయవర్గాల సమాచారం.

                                                        

About Author