జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో చార్జిషీట్ సిద్ధం
1 min readపల్లెవెలుగువెబ్ : జూబ్లీహిల్స్‌లో విదేశీ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు 420 పేజీలతో చార్జిషీట్ సిద్ధం చేశారు. ఫోరెన్సిక్, వైద్యుల నివేదికలను ఈ చార్జిషీట్లో ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఎక్కడా లోటుపాట్లు లేకుండా.. నిందితులకు కఠిన శిక్ష పడేలా సిద్ధం చేసిన చార్జిషీట్‌ను తొలుత న్యాయనిపుణుల సలహా కోసం పంపినట్లు తెలిసింది. నిజానికి ఈ కేసు పోక్సో సెక్షన్ కింద నమోదైంది. పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. ఈ ఘటన జరిగి ఈ నెలాఖరుకు 60 రోజులు పూర్తవుతాయి. దీంతో శుక్రవారం లోపే చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు.