ఏపీ మంత్రికి యాక్సిడెంట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున, ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కాన్వాయ్‌లో విజయవాడకు వస్తుండగా శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ విజయవాడకు వస్తుండగా వారధిపై ఆటో అడ్డుగా వచ్చింది. కాన్వాయ్‌లోని ముందు వెళ్తున్న వాహన డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో మంత్రి కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి నాగార్జున స్వల్పంగా గాయపడ్డారు. అదే కారులో ఉన్న ఆయన కుమారుడు కిరణ్ ముందు ఉన్న డాష్‌బోర్డును ఢీ కొట్టడంతో పెదవి వద్ద గాయమైంది. కాన్వాయ్‌లోని సిబ్బంది వారిని మరో వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.