ఏపీ నిరుద్యోగులకు శుభవార్త
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. సెపె్టంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్టికెట్లలో తెలియజేస్తారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.