PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`జ‌బ‌ర్ద‌స్త్` షో ఎందుకు మానేసిందో చెప్పిన యాకంర్ అన‌సూయ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ ఇటీవలె ఓ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆ షోకు యాంకర్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి ఆ షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్ల నుంచే షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్‌ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్‌, వెకిలి చేష్టలు లాంటివి నాకు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి షోలో వేయరు. క్రియేటివ్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ నేను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మరో విషయం ఏంటంటే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్‌ కాదు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

                                       

About Author