అసభ్యకర వీడియో లీక్.. ఫేక్ అన్న అంజలి !
1 min readపల్లెవెలుగువెబ్ : లాకప్
షో తర్వాత మరింత పాపులారిటీ సంపాందించుకుంది అంజలి అరోరా. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అంజలి అరోరా ఎమ్ఎమ్ఎస్ పేరిట ఒక ఫేక్ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఆ వీడియోలో అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం, అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగా అందరు భావిస్తున్నారు. అయితే ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. అది ఎవరు సృష్టించారో? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని ఎమోషనల్ అయింది.