అలాంటి డ్రెస్ వేస్తే.. లైంగిక వేధింపుల కేసు చెల్లదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది.