జూ.ఎన్టీఆర్ కి తప్పితే చాలా మంది హీరోలకి రాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు రాదంటూ ఆక్షేపించారు. “ చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ .. వంటి యాక్టర్స్ తప్పితే ఎవరూ కూడా తమ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మాట్లాడటం లేదు. అసలు చాలామంది హీరోస్‌కి తెలుగు చదవటమే రాదు. ఇంకా వాళ్ళు తెలుగులో ఎందుకు మాట్లాడతారు. దానికి తోడు ఈ పాన్ ఇండియా అన్న పిచ్చి బాగా తలకెక్కడంతో, కొనఊపిరితో వున్న ఆ కాస్త తెలుగుని కూడా మార్చేస్తున్నారు. పర భాషా నటులు ప్రకాష్ రాజ్ , సిద్ధార్థ్ లాంటి యాక్టర్స్ తెలుగు నేర్చుకొని, తెలుగు చక్కగా మాట్లాడుతుంటే, మనవాళ్ళు తెలుగుని మరిచిపోతున్నారు. ‘ఒరేయ్’, ‘ఒసేయ్’ అన్న పదాలు అవమానకరంగా వుండేవిగా భావించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పదాలు వాడుక పదాలు అయ్యాయి” అని అన్నారాయన.