ఆస్తి, నీటి పన్ను చెల్లించాల్సిందే..
1 min read– లేదంటే నీటి సరఫరా కట్
పల్లెవెలుగు వెబ్, కడప: ఆస్తి, నీటి పన్ను బకాయిలు ఉన్న వారు వెంటనే చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ లవన్న హెచ్చరించారు. పాత బకాయిలు వసూలు చేయడంలో భాగంగా శనివారం స్పెషల్ బృందం ఇంటింటికి తిరిగి ఆస్తి, నీటి పన్ను వసూలు చేస్తున్నారన్నారు. చెల్లించని వారి ఇంటికి నీటి కనెక్షన్ తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, డిప్యూటీ మేయర్, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగపు డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.