లాక్ డౌన్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో కరోన రెండో దశ వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి… లాక్ డౌన్ పెడితే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని అన్నారు. కరోన కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని, వ్యాక్సిన్ వేయించుకున్నా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కరోన నియంత్రణ మీద ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.