కొలిమిగుండ్ల రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి
1 min readపల్లెవెలుగువెబ్: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఎత్తైన ర్యాంపులు కూలి పోవడంతో వాటి కింద పడి ఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై ఫ్యాక్టరీలోని ఇతర కార్మికులు ఆందోళనకు దిగారు. ఘటన వార్త తెలుసుకుని . ఫ్యాక్టరీ వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.