దేశంలో అత్యంత ధనవంతుడు కావడమే జగన్ లక్ష్యం
1 min read

పల్లెవెలుగువెబ్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. దేశంలోనే అంత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేస్తోందని అన్నారు. ఏపీలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని చెప్పారు. జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని… ఆయన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని అన్నారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్… ఇప్పుడు మోసం చేస్తున్నారని విమర్శించారు.

