`ఆదిపురుష్` పై మంత్రి ఆగ్రహం !
1 min readపల్లెవెలుగువెబ్: అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. అయితే, అందులో రావణ, హనుమాన్ పాత్రలు కనిపించిన తీరుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మిలిటరీ క్రాఫుతో, పొడవైన గడ్డంతో విచిత్రంగా కనిపించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హనుమంతుడు కూడా ఇంగ్లీషు సినిమాల్లో కింగ్ కాంగ్ లా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడి వేషధారణ అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో హనుమంతుడి వేషధారణ సరికాదని అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే ఆదిపురుష్ నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.