PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రై ఫ్రూట్స్ తో లాభాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: శరీరానికి అత్యుత్తమ పోషకాలను అందించే ఎండు పండ్లు, గింజలే డ్రైఫ్రూట్స్‌. సాధారణ పోషకాలతోపాటు మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. కొన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ తో కొన్ని రకాల లాభాలు ఉంటే.. మరికొన్నింటితో ఇతర భిన్నమైన ప్రయోజనాలు సమకూరుతాయి. రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం ద్వారా.. శరీరంలో జీవక్రియలు వేగం పుంజుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేరుగా తినడమేగాకుండా సలాడ్లు, ఇతర ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ సమకూరుతాయని వివరిస్తున్నారు.

                                        

About Author