ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ ఇక లేరు..
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. కరోన బారినపడ్డ ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అజిత్ సింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రైతు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అజిత్ సింగ్.. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అజిత్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు .. అజిత్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.