PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్టు చేశారు. భీమవరంలో ఓ హోటల్ లో బస చేసిన పుట్ట మధును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలు క్రితం హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామనరావు కేసులో పుట్ట మధును విచారించనున్నారు. వామన రావు హత్య కేసులో నిందితుడుగా ఉన్న బిట్టు శ్రీనివాస్ ఉపయోగించిన కారు…పుట్ట మధు కొనుగోలు చేసిన కారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వామనరావు హత్యకు ముందు 2 కోట్ల రూపాయలు పుట్ట మధు విత్ డ్రా చేసినట్టు అనుమానిస్తున్నారు. గత రెండు వారాలుగా పుట్ట మధు వివిధ రాష్ట్రాల్లో తలదాచకుంటున్నారు. పుట్ట మధు …ఈటెల రాజేంద్రకు మంచి మిత్రుడు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు రాజకీయంగా సంచలనంగా మారింది.

About Author