PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ అమ్మాయిగారు ’ సరికొత్త ధారావాహిక రాబోతుంది

1 min read

– జి తెలుగులో ఆక్టోబర్ 31 నుండి తండ్రి ప్రేమ కోసం కూతురు పడే తపనే
పల్లెవెలుగు , వెబ్​ కర్నూల్ : అద్భుతమైన కథ – కథనాలు , ప్రేక్షకుల్ని కట్టిపడేసే మలుపులతో గత కొన్నేళ్లుగా ప్రేక్షక లోకాన్ని ఎంటర్ టైన్ చేస్తోంది మన జీ తెలుగు . ఎప్పటిలాగే ఇప్పుడు కుడా ఒక విభిన్న కథాంశంతో ‘ అమ్మాయిగారు ‘ అనే సరికొత్త ధారావాహికతో మన ముందుకు రాబోతుంది . అక్టోబర్ 31 న ప్రారంభం కానున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 లకు ప్రసారం కానుంది . ‘ అమ్మాయిగారు ‘ – తండ్రి ప్రేమ కోసం తపన పడే కూతురు , కూతురిని దూరంగా పెట్టే తండ్రి , ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి . నేటి తరం తండ్రీకూతురు అనగానే అందరికి గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ మహేష్ , సితార . అందుకే ఇప్పుడు ఈ అమ్మాయిగారు సీరియల్ని సూపర్ స్టార్ మహేష్ , ఆయన గారాలపట్టి సితార లాంచ్ చేశారు . లాంచ్ డైలాగ్ ” ప్రేమలేని ఐశ్వర్యం … ఐశ్వర్యమే కాదు … అమ్మాయిగారు సీరియల్పై ప్రోమోలో మహేష్ చెప్పిన అంచనాలు పెంచేసింది . ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు . ఇక అమ్మాయిగారు కథ విషయానికి వస్తే … రూప , ప్రతాప్ సూర్యదేవ్ మరియు రాజు అనే మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది . విద్యాశాఖ మంత్రి అయిన ప్రతాప్ సూర్యదేవ్ కూతురే రూప . పుట్టింది , పెరిగింది డబ్బున్న కుటుంబంలో అయినా తండ్రి ఆలనాపాలనకు , ప్రేమానురాగాలకు దూరం అవుతుంది రూప . అయితే గతంలో జరిగిన ఒక సంఘటనతో తన భార్యపై ఉన్న కోపాన్ని రూపపై చూపిస్తుంటాడు ప్రతాప్ సూర్యదేవ్ . కానీ రూప మాత్రం ఎప్పటికైనా తండ్రి తన మమకారాన్ని అర్థం చేసుకుంటాడని ఎదురుచూస్తుంటుంది . మరోవైపు ప్రతాప్ సూర్యదేవ్ కి కుడి భుజంగా ఉంటాడు . ‘ రాజు సూర్యదే వ్యవహారాలు మొత్తం దగ్గరుం డి చూసుకునేది రాజునే . అలాంటి రాజు , రూప మధ్య ఆసక్తికరమైన సంబంధం ఏర్పడుతుంది . అదే సమయంలో ఒక కీలకమైన మలుపుతో మొత్తం వ్యవహారం మారిపోతుంది . ఇలాంటి సమయంలో రాజు పాత్ర ఎలాంటి మలుపులకు దారి తీస్తుంది . ? రూప తన తండ్రి ప్రేమను తిరిగి పొందుతుందా . ? అనేది తెలియాలంటే అక్టోబర్ 31 నుంచి జీ తెలుగులో ప్రసారం అయ్యే అమ్మాయిగారు సీరియల్ చూడాల్సిందే . ఈ సందర్భంగా సీరియల్లో కీలకపాత్రలో నటించిన నిషా రవికృష్ణన్ మాట్లాడారు . ” జీ తెలుగులో ఇది నా రెండో షో . అమ్మాయిగారు సీరియల్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని నేను చాలా ఎగ్జిటెడ్ గా ఉన్నాను . ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , నా మొదటి సీరియల్ ముత్యమంత ముద్దుని హీరోయిన్ కృతి శెట్టి ప్రారంభించారు . ఇప్పుడు నా రెండో సీరియల్ని సూపర్ స్టార్ మహేష్ , ఆయన ముద్దుల కూతురు సితార ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది . ఒక టీమ్ , మేమంతా లాంచ్ గురించి చాలా ఎగ్జిటెడ్ గా ఉన్నాము . ఎందుకంటే అమ్మాయిగారు కథ చాలా ప్రత్యేకమైనది . ప్రధానంగా ఇది తండ్రికూతుళ్ల మధ్య బంధం , అనుబంధాలను ఆవిష్కరిస్తుంది . ఈ సీరియల్కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను అని అన్నారు . కూతురు రూప , తండ్రి ప్రతాప్ సూర్యదేవ్ మధ్య ప్రేమానురాగాలే ప్రధాన కథాంశంగా రూపొందిన అమ్మాయిగారు సీరియల్ మీ అభిమాన జీ తెలుగు ఛానల్ లో అక్టోబర్ 31 నుండి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 లకు ప్రసారం కానుంది . డోంట్ మిస్ ఇట్ .

About Author