PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పట్టణ ప్రణాళిక దినోత్సవం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని మున్సిపాలిటీ లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగాధికారులు, ఉద్యోగులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారి బాలమద్దయ్య ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక 73వ దినోత్సవం సందర్భంగా కమిషనర్ పి.కిషోర్ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తించడం ద్వారా ప్రణాళికాబద్ధ అభివృద్ధికి, ప్రజలు నాణ్యమైన జీవనం గడిపేందుకు తోడ్పడలంటూ పేర్కొన్నారు .పర్యావరణ పరిరక్షణకూ శ్రమించాలని, ప్లాన్లు తదితరాల కోసం వచ్చే ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలందించాలని సూచించారు. ప్రతి వార్డు ప్లానింగ్ సెక్రటరీ తమ విధులను భాగా నిర్వర్తించి నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్లానింగ్ సెక్రటరీ లు ప్రవీణ్, హుసేన్, నరేష్, సుదర్శన్, శ్రీనాథ్, అశోక్, రమేష్, కిరణ్మయి, జ్ఞానేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

About Author