PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

67 ఏళ్ల వయసులో..కాలినడకన పుణ్యక్షేత్రాల దర్శనం

1 min read

– నేటికీ 12వేల 9వందల కి మీ నడక
పల్లెవెలుగు, వెబ్​ మహానంది: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నా పెద్దా తేడాలేకుండా నాలుగు అడుగులదూరం వెళ్లాలన్న బైక్ లేదా ఆటోను ఆశ్రయిస్తున్న రోజులు.67 ఏళ్ల వయసులో 1కాదు రెండు కాదు ఏకంగా 12వేళా 9 వందల కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన పూర్తిచేసి అందరిని ఆకట్టుకున్న మాజీ పోస్టుమాస్టార్ చంద్రశేఖర్.భారతదేశం లోని పలురాష్ట్రాలలో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకుంటు శ్రీశైలం నుండి బుధవారం ఉదయం మహనందికి చేరుకున్న ఆయనకు పోస్టల్ శాఖ నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ప్రసాద్ కలిసి స్వాగతం పలికారు. కాలినడకన ప్రయాణం చేసి ఆధ్యాత్మికత పై అవగాహన కల్పిస్తు కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోవాలని ప్రజలకోసం కుటుంబానికి దూరమై ఇంతటి సహసోత మైన నిర్ణయం తీసుకోవడం నిజంగా ఎంతో గొప్పదన్నారు. ఇలాంటి గొప్పవారిని కలుసుకోవడం ఎంతో అదృష్టమని తెలిపారు.అంతకు ముందు చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతదేశంలో ఆధ్యాత్మికత పెరగాలన్నారు.మోదీప్రవేశ పెట్టిన స్వచ్చ భారత్ మంచి దన్నారు. ప్రతిఒక్కరు పాటించాలని కోరారు.16 వేళ కి మీ కాలినడక పూర్తి పూర్తిచేసుకుని కుటుంబ సభ్యులను కలుస్తానని తెలిపారు. ఈ యాత్ర భారత దేశానికి అంకితమని తెలిపారు.వారి వెంట పోస్టల్ శ్యాఖ ఎం ఓ గణేష్, శేషు, నాయక్, నరసింహ తదితరులు ఉన్నారు.

About Author