కర్నూలు కలెక్టర్‌కు కరోన పాజిటివ్
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు : కర్నూలు కలెక్టర్ జి. వీరపాండియన్‌కు కరోన పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆయన ఐ అండ్ పీఆర్ ద్వారా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోన పరీక్ష చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్‌గా జేసీ–2 (అభివృద్ధి మరియు రెవెన్యూ) రాం సుందర్ రెడ్డి పది రోజులపాటు కొనసాగుతారని ఉన్నతాధికారులు తెలిపారు.