మంత్రి రోజాను జైల్లో కూర్చోబెడతా !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏ స్టేషన్ లో అయితే కూర్చోబెట్టారో… అదే స్టేషన్ లో మంత్రి రోజాను 18 నెలలు తిరిగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టైన కిరణ్… శనివారం మధ్యాహ్నానికే బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం జనసేన తిరుపతి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.