PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో సంక్రాంతి సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఇరిగేషన్ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు పశ్చిమగోదావరి జిల్లా జె ఏ సి చైర్మన్ ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు పాల్గొని అందరూ సంప్రదాయ దుస్తులతో అలరించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వారి మాటలు, పాటలు తో చిన్న పిల్లలు కి భోగి పండ్లు మహిళలు వేశారు. భోగి మంటలు ఏర్పాటు చేసి చుట్టూ పిల్లలు తో కోలాటాలు వేసి, గాలి పటాలు ఎగుర వేసి, సంక్రాంతి పండుగ ను ఇరిగేషన్ ఉద్యోగులు ముందుగానే తీసుకొచ్చారని వక్తలు అందరు కొనియాడారు. అనంతరం హేలాపురి సింగర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సింగర్స్ అర్జున్, సూర్య ప్రకాష్, శ్రావణి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రూపేష్ వర్మ, త్రిపుర ప్రియదర్శిని, పాటల తో అలరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ కనుగుల శ్రీనివాస్, నీరు ప్రగతి ఎస్ ఈ రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవ ప్రకాష్, పే & అకౌంట్స్ ఆఫీసర్ నరేష్ కుమార్, జిల్లా ఎన్జీవో సంఘం కార్యదర్శి నెరుసు రామారావు పాల్గొని సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు.

About Author