జాతీయ బాలిక వారోత్సవాలను విజయవంతం చేద్దాం
1 min read– జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జాతీయ బాలిక వారోత్సవాలను విజయవంతం చేద్దాం అని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.శనివారం సాయంకాలం కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో భేటీ పడావో బేటి బచావో వాల్పోస్టర్లను కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా.యస్.సంజీవ్ కుమార్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో
జాతీయ బాలిక వారోత్సవాలను ఈనెల 18 వ తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించుకుంటున్నామని ఈ వారోత్సవాలను సంబంధిత శాఖల వారందరూ ప్రజలకు అవగాహన కల్పించి ఆడపిల్లలను రక్షించుకుందాం – ఆడపిల్లలను చదివించుకుందామన్నారు. హాజరైన అధికారులతో బాలిక విద్యను ప్రోత్సహించాలి వాత్సల్యాలతో స్వాగతిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైన నిరోధించుటకు అందరం ప్రయత్నం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.మహిళా శానిటేషన్ సిబ్బందిని జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు జ్ఞాపికలను అందజేసి శాలువతో సత్కరించారు అనంతరం జాతీయ బాలిక వారోత్సవాల సందర్భంగా బ్యానర్ పైన ప్రజా ప్రతినిధులు సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కుమారి, ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.