శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వార్ల హుండీ లెక్కింపులు ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం చేకూరింది. 23 రోజుల హుండీ ద్వారా రూ: 2,67,88,598/- ఆదాయం వచ్చిందిమల్లన్నకు కానుకల రూపంలోయుఎస్ఏ డాలర్లు – 1,517 ఇంగ్లాండు పౌండ్స్ – 25, ఆస్ట్రేలియా డాలర్లు 50, కెనడా – – 20, సింగపూర్ డాలర్లు 4 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. బంగారు 301 గ్రాముల 500 మిల్లీ గ్రాములువెండి 6 కేజీల 500 గ్రాములు భక్తులు మల్లన్నకు సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు శివసేవకులు ఆలయ చైర్మన్ ఆలయ ఈవో లవన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.