జి.సింగవరంలో.. ‘ఇదేం ఖర్మ’
1 min readపల్లెవెలుగు వెబ్:రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూల్ మండల పరిధిలోని జి సింగవరం గ్రామంలో కర్నూల్ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కోడుమూరు టిడిపి ఇన్చార్జి ఆకే పోగు ప్రభాకర్ అన్న గారు హాజరు కావడం జరిగింది. గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ప్రజలకు తెలపడం జరిగింది ఇసుక, మద్యం దోపిడీ గురించి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, కర్నూల్ పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ భాష ,కర్నూల్ పార్లమెంటు మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్షావలి, గార్గేయపురం గ్రామ అధ్యక్షుడు సోఫీబెగ్, రెడ్డిపోగు భాస్కర్, ఐ టిడిపి అధ్యక్షుడు బోయ కృష్ణ మరియు సయ్యద్ భాష, జగదీష్ గౌడ్, పకీరయ్య మరియు టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.