జిల్లా కలెక్టర్ ని కలసిన బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం నాడు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఐఏఎస్ గారిని కలసి బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి కర్నూలు వారు చేస్తున్న నారాయణ అన్న ప్రసాదం వితరణ పథకం కోసం ఒక కిచెన్ స్టోర్ రూం ఆఫీసు రూం కొరకు ఒక క్వార్టర్స్ లేక తగిన స్థలము ఒక 5 సెంట్స్ ఇవ్వవలసినదిగా కోరుతూ సండేల్ చంద్రశేఖర్ గారు ఒక వినతి పత్రం సమర్పించారు అందుకు కలెక్టర్ గారు ఈవిషయం లో సానుకూలంగా స్పందించారు. త్వరలో మీకు తగిన ఏర్పాటు చేస్తాను అని అన్నారు, సండే ల్ చంద్రశేఖర్ అధ్యక్షుడు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి కర్నూలు ఆధ్వర్యములో శ్రీ పసుపుల మురళీకృష్ణ zptc , N రాజశేఖర్ కోశాదికారి, k. శ్యామసుందర్ రావు, కార్యదర్శి , A రాధాకృష్ణ, ఈ సిమెంబర్, గౌరవ సభ్యుడు శ్రీ మామిల్లపల్లి రాజేష్ , cs ప్రసాద రావు, శ్రీనివాసరాజు, చల్ల నాగరాజ శర్మ, కరణం వాస్తు శ్రీనివాసరావు, సురేష్, ఈసి మెంబర్లు పాల్గొన్నారు.