PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్తార్ జాహీద్ టీడీపీ పార్టీ కి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా

1 min read

టిడిపి పార్టీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తార్ జాహీద్ టీడీపీ పార్టీ కి గుడ్ బై
త్వరలోనే వైయస్సార్ పార్టీ లో చేరనున్న ఆత్తార్ జాహీద్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణానికి చెందిన టీడీపీ పార్టీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తార్ జాహీద్ టీడీపీ పార్టీ కి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా కు తెలిపారు.తాను బనగానపల్లె టీడీపీ పార్టీ ఇంచార్జ్ బిసి జనార్దన్ రెడ్డి యొక్క అనుమానాలకు తాను పార్టీ లో ఉండలేకపోతున్నాను అని అలాగే పార్టీ లో అవమానాలు కూడా తట్టుకోలేక ఈ రోజు టీడీపీ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని పార్టీ కి బిసి జనార్దన్ రెడ్డి కి ఎనలేని సేవలు చేశాను అని అయితే ఈ రోజు బిసి జనార్దన్ రెడ్డి తాను పార్టీ విడడానికి ప్రధాన కారకుడు అయ్యారు అని చెప్పారు.2014 ఎన్నికల్లో బిసి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గెలుపొందడానికి తను ఎనలేని కృషి చేయడం జరిగింది అని చెప్పారు.త్వరలోనే తన బంధు మిత్రులతో కలిసి వైయస్సార్ పార్టీ లో త్వరలోనే చేరడం జరుగుతుంది అని చెప్పారు.

About Author