PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్ద దుర్గాను దర్శించుకున్న తెలంగాణ యువ పారిశ్రామికవేత్త

1 min read

పెద్ద దర్గా విశిష్టతను తెలిపిన పెద్ద దర్గా నిర్వాహకులు

పల్లెవెలుగు వెబ్ కడప : పెద్ద దర్గాను తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన యువ పారిశ్రామికవేత్త, ఎస్ఎస్ ఫ్యాషన్ అధినేత శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది, శ్రీనివాసరావు ఒక వ్యాపార ఎత్తగానే కాకుండా ఆయన సేవా రంగంలో, సేవ దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ఈయన ఎంతోమంది అనాధలకు, అభాగ్యులకు తమ ట్రస్టు ద్వారా ఆదుకోవడంతోపాటు, శ్రీమద్విరాట్ పోతులూరి బ్రహ్మంగారి ప్రచార యాత్రకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో దోహదపడడం జరిగింది, కడప పెద్ద దర్గాను దర్శించుకున్న ఆయన దర్గా లోనికి చాందర్తో వెళ్ళగా అక్కడి దర్గా నిర్వాహకులు ఆయనను దర్గా లోనికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన దర్గా విశిష్టతను గురించి నిర్వాహకుల ను అడిగి తెలుసుకోవడం జరిగింది, ఎంతోమంది గొప్ప గొప్ప గురువులతో కూడినటువంటి ఈ దర్గా విశిష్టత గురించి తెలుసుకున్నప్పుడు, ఒక గొప్ప దైవ స్వరూపాన్ని చూసిన ఆనందం కలిగిందని ఆయన పేర్కొన్నారు, అంతేకాకుండా తమ కుటుంబంతో పెద్ద దర్గా సందర్శించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు, ఈయన వెంట బ్రహ్మంగారి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త,శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి ప్రవచనకర్త డాక్టర్ కృష్ణమాచార్య, ఆయన శిష్య బృందం పాల్గొనడం జరిగింది.

About Author