PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్లల కోసం.. కోవిడ్​ హెల్ప్​ డెస్క్​

1 min read

– పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి, కలెక్టర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్​–19 తో తల్లిదండ్రులు మృతి చెంది అనాథలైన పిల్లల పునరావాసం కోసం మరియు తల్లిదండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో చేర్చబడినట్లయితే వారి పిల్లల తాత్కాలిక సంరక్షణ కొరకు 181 మరియు 1098 (చైల్డ్ లైన్) టోల్ ఫ్రీ నెంబర్ లకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక గెస్ట్ హౌస్ మీటింగ్ హాల్ లో మహిళలు, పిల్లలు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల కొరకు కోవిడ్ హెల్ప్ డెస్క్ పోస్టర్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు, పాణ్యం, కోడుమూరు, నందికొట్కూరు, నంద్యాల ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ జె.సుధాకర్, తోగూరు ఆర్థర్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి లు పోస్టర్లను ఆవిష్కరించారు. పోస్టర్ల ఆవిష్కరణలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author