దేవాదాశాఖ మొద్దు నిద్ర..
1 min read– ఆదాయం ఉన్న ధూప దీప నైవేద్యం సున్నా..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గ్రామాలలో ఆలయాలలో. ధూప దీప నైవేద్యం పెట్టేవారు కరువయ్యారు శ్రీరామునికైనా ధూప నైవేద్యాలు దూరమే సంవత్సరములు మొదటి పండుగ అయినటువంటి ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమి కి ఎంతో విశిష్టత కలిగి ఉంది అలాంటి శ్రీరాముని కళ్యాణం రోజున మండల పరిధిలోని కే బొల్లవరం గ్రామంలో శ్రీరామునికి కళ్యాణం కనుమరుగయిందని బిజెపి మండల అధ్యక్షుడు ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు గురువారం నాడు శ్రీరామనవమి రోజున శ్రీరామునికి కళ్యాణం చేయకపోవడం శోచనీయమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల మాట కూడా వినని ఆలయ ఈవోగాని సిబ్బంది గానీ పనిచేయట్లేదని సాక్షాత్తు శ్రీరామునికి కళ్యాణం జరగకుండా నిలువరించడం తగదన్నారు ఆలయానికి చెందిన భూముల ఆదాయం దేవాదాయ శాఖ తీసుకుంటూ శ్రీరాముని పై నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబని ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంపై ముందస్తుగానే పత్రికల్లో కళ్యాణ గురించి వచ్చినప్పటికీ మరియు సమయం ఉన్నప్పటికీ అధికారులు శ్రీరామునికి కళ్యాణం నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా గ్రామంలో రామాలయంలో ధూప దీప నైవేద్యాలు జరిగెల చర్యలు తీసుకోవాలని లేకపోతే దీనిపై దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.