‘రుయా’ బాధితులకు అండగా ఉంటాం..
1 min read– రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి: ఇటీవల రుయా ఆస్పత్రిలో ప్రమాదవ శాత్తు మృతి చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. చిట్వేలి మండలం కుక్కల దొడ్డి గ్రామానికి చెందిన కలందర్ ఇటీవల రుయా ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు ఆక్సిజన్ అందక మృతి చెందారు. బాధిత కుటుంబానికి మంగళవారం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు రూ. 10లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శిరీష , పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి,ఉప సర్పంచ్ సాయి, కుక్కల దొడ్డి సర్పంచ్ రమణ, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.