‘ట్రాన్స్ జెండర్స్’ కేంద్ర సాయం సద్వినియోగం చేసుకోండి
1 min read– ఏడీ విజయ
పల్లెవెలుగు కర్నూలు: కరోన కష్టకాలంలో ట్రాన్స్‌జెండర్స్‌ను ఆదుకునేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము వారు రూ.1500 ఆర్థిక సాయం ప్రకటించిందని విభిన్న ప్రతిభ వంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా మేనేజర్ పి. విజయ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కొరకు.. http://www.nisd.gov.in అను వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశమును జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరు సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెలాఖరి (31.05.2021)లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఏడీ విజయ వెల్లడించారు.