పేదలకు సాయం చేయడం.. అదృష్టం
1 min read– కేజేఏసీ కన్వీనర్ దేవపూజ ధనుంజయ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పేదలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేజేఏసీ కన్వీనర్ దేవపూజ ధనుంజయ అన్నారు. కరోన కష్టకాలంలో పేదలకు ఆర్థికంగా చితికిపోయారని, వారిని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆదుకోవాలని కోరారు. బుధవారం నగరంలోని రుక్ముణి నగర్లో 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 29 వ డివిజన్ కార్పొరేటర్ సంగాల సుదర్శన్ చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవపూజ ధనుంజయ మాట్లాడుతూ మూడు రోజులుగా నగరంలోని పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సాయం చేయాలనుకునే దాతలు ముందుకు వస్తే.. కేజేఏసీ ఆధ్వర్యంలో పేదలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రముంలో KJAC కన్వీనర్లు బత్తుల లక్ష్మికాంతయ్య, సీమకృష్ణ, రంగముని నాయుడు, తిరుమలగౌడు, V. V. నాయుడు, బేస్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.