PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి

1 min read

– నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​
– టౌన్​ సీఐలకు.. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందజేత
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కరోన సమయంలో పోలీసులు, మున్సిపాలిటీ, రెవెన్యూ, ప్రభుత్వ అత్యవసర ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, వారందరికీ ప్రజలు రుణపడి ఉంటారని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ అన్నారు. బుధవారం స్థానిక రాయల్​ ఫంక్షన్​ హాల్​లో నగరంలోని టౌన్​ సీఐలకు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. కరోన క్లిష్టపరిస్థితుల్లో సేవలు అందిస్తున్నారని, వారికి జగనన్న మైల్డ్​ కేర్​ సెంటర్​ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేశామన్నారు. ఎవరైనా.. సరే జగనన్న ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పొందవచ్చన్నారు. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

About Author