పంపాక్షేత్రమే హనుమంతుని జన్మస్థలం..!
1 min readపల్లెవెలుగు వెబ్: కర్ణాటకలోని పంపాక్షేత్రంలో ఉన్న కిష్కిందలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థానమని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజి అన్నారు. గురువారం ఆయన తిరుమలలోని గోశాల సందర్శించి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ పండితులతో హనుమంతుడి జన్మస్థలం మీద చర్చించనున్నారు. వాదన ముగిసిన తర్వాత టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులును పంపా క్షేత్రంలోని అంజనాద్రి పర్వతానికి తీసుకెళ్తామని స్వామీజి తెలిపారు.