PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

1 min read

: పస్పిల్ మున్నా, రేడియం నూర్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మే 1 వ తేదీ నుంచి ఆత్మకూర్ పట్టణంలోని స్టేడియం ప్రాంగణంలో వేసవిలో వాలీబాల్ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా తెలిపారు.ఈ శిక్షణ శిబిరాలు 30 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూర్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు, సౌత్ సెంట్రల్ రైల్వే కోచ్ నిమ్మి కృష్ణ యాదవ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఆత్మకూర్ మండల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ కి అవకాశం కల్పించిన నంద్యాల జిల్లా వాలీబాల్ చీఫ్ కోచ్ రాజు కి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ గౌరవాద్యక్షులు రేడియం నూర్ మరియు సహాయ కార్యదర్శి ఆసీఫ్ బేగ్ పాల్గొన్నారు.

About Author