PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెలవుల్లో క్రీడా సాధన చేయండి

1 min read

– ఒలింపిక్ సంఘం అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయక, క్రీడా సాధన చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనిజిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు విద్యార్థులను కోరారు. శుక్రవారం రైల్వే స్టేషన్ వెనక ఉన్న అశోక్ నగర్ లోని ఆర్కే. అకాడమీలో రైఫిల్ షూటింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. షూటింగ్ క్రీడాంశం ఒలంపిక్ గేమ్ అన్నారు.ఇటువంటి క్రీడలో సాధన చేస్తే విద్యా ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉందని ఆయన వివరించారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ అలాగే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సాధన, పోటీలు రెగ్యులర్గా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం .ఎం .డి. భాష, కోచ్ రవికుమార్ తో పాటు రైఫిల్ షూటర్స్ పాల్గొన్నారు.

About Author