వెన్నెల గ్రూప్ అవకతవకలపై ఏరియా కోఆర్డినేటర్ విచారణ..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల కేంద్రంలోని పెసర వాయి గ్రామానికి చెందిన బుక్ కీపర్ శివమ్మ, అవకతవకలకు కొత్తగా పొదుపు గ్రూపు తయారుచేసి వెన్నెల గ్రూపులో ఇతర గ్రూపు సభ్యులను చేర్చి స్టేట్ బ్యాంక్ లో 4 లక్షలు రూపాయలు రుణం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో పిడి ఆదేశాలతో గురువారం నాడు ఏరియా కోఆర్డినేటర్ బాబురావు, ఏపీఎం హజరత్ ఉస్మాన్ పెసరవాయి గ్రామంలో వెన్నెల గ్రూప్ సభ్యులను, మరియు బుక్ కీపర్ శివమ్మ ను విచారించి వివరాలు సేకరించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.