శీలయ్య మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి
1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం తమ్మడపల్లె గ్రామం శివారు పొలాల్లో పొలం పనులకు వెళ్లిన మడ్డి శీలయ్య 34 సంవత్సరాల యువకుడు నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురై మృతి చెందడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పిడుగుపాటుకు గురై శీలయ్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి శీలయ్య మృతదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

