PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటరీ సేవలకు ప్రతిభా పురస్కారాలు..

1 min read

– వారి సేవలు అభినందనీయం.. మాజీ మంత్రి ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి.వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం ఇచ్చే గౌరవ పుష్కారాలకు ఈ సంవత్సరం ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని పురస్కారాలు పొందిన వారికి సోమవారం శాసనసభ్యులు ఆళ్ల నాని క్యాంప్ కార్యాలయ పురస్కారాలు అందించి శుభాకాంక్షలు తెలిశారు నాని మాట్లాడుతూ వాలంటరీ సేవలు అభినందనీయమని, మన ముఖ్యమంత్రి ఆలోచన విధానంతో వాలంటరీ వ్యవస్థను బలోపేతం చేసి వారిని మరింత ప్రోత్సహించే విధంగా ఇటువంటి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఆళ్ల నాని తో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు శాలువాలతో ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్కరికి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author