ఉత్తమ సేవకు.. అత్యుత్తమ గుర్తింపు…
1 min readడా. చంద్రశేఖర్‌కు జీవన సాఫల్య పురస్కారం అందజేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్‌మిశ్రా
పల్లెవెలుగు: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర చికిత్స చేసి.. ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్‌కు జీవన సాఫల్య పురస్కారం వరించింది. కొన్నేళ్లపాటు కార్డియాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డా. చంద్రశేఖర్ ఉత్తమ సేవలను గుర్తించి… ఎన్జీఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. ప్రపంచల వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని హై టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, డా. మారుతి ఈ పురస్కరాన్ని అందజేసి..అభినందించారు.
- కర్నూలు జిల్లాకు గర్వకారణం..
- రాయలసీమ జిల్లాలతోపాటు రాయచూరు, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల నుంచి వివిధ వ్యాధులతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు. గుండెకు సంబంధించిన వ్యాధులకు మాత్రం కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ రోగులకు ఉత్తమ సేవ అందించారు. డా. చంద్రశేఖర్ ఉన్నారంటే… ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన రోగి గుండె సేఫ్ ..అని ప్రజలు బాహాటంగా చెబుతారు. వైద్య సేవలను గుర్తించి… లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కించుకొని.. కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు.