హోటల్ రంగం..అభివృద్ధి చేస్తా : హనుమంత రావు
1 min readఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరి సముద్రాల హనుమంత రావు
పల్లెవెలుగు, విజయవాడ: రాష్ట్రంలో హోటల్ రంగం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు ఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరి సముద్రాల హనుమంత రావు. విజయవాడలో హోటల్ HYATT PLACE లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్.వి. స్వామి, రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజు శ్రీకాకుళం, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా సముద్రాల హనుమంతరావు కర్నూలు, రాష్ట్ర కోశాధికారిగా పూర్ణచంద్రరావు తెనాలి మరియు ఈసీ మెంబర్లుగా వైస్ ప్రెసిడెంట్ గా జాయింట్ సెక్రటరీగా రాష్ట్రం మొత్తం మీద 107 మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రాయలసీమ జోన్ నుంచి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరిగా తనకు అవకాశం కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. తనకు మద్దతు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, హోటల్ యజమానుల అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది తీరాన కార్పొరేట్ స్థాయిలో క్యాటరింగ్ కాలేజిలు ప్రారంభిస్తామని, హోటల్ రంగంలో పని చేసేందుకు ఆసక్తి చూపే యువతకు శిక్షణ ఇచ్చి అవకాశం కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.