PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హలో ఏపీ… బై బై వైసీపీ అంటూ నినాదాలు..!

1 min read
వాలంటీర్ల పేరుతో యువత జీవితాలను నాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

– 4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5000 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు

–ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ

–ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన జనసేన నాయకులు

– అరెస్టులతో జనసేన కార్యకర్తలని ఆపలేరు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్  వాలంటీర్లపై తప్పు మాట్లాడారని దాన్ని వక్రీకరిస్తూ కొంతమంది ఆకతాయిలు గుండాలు వైఎస్సార్సీపీకి చెందిన అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై నిరసన వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంగా కర్నూలు జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చింత సురేష్ బాబు గారికి ఆదేశాల మేరకు కల్లూరు ఎస్టేట్ చిన్నమ్మ సర్కిల్ నందు వైయస్ జగన్ దిష్టిబొమ్మ దహనం చేసి Hello Ap Bye Bye YCP , సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో పోలీసుల రంగ ప్రవేశం చేసి మంజునాథ్, సుధాకర్, గోవిందు, సతీషు, కృష్ణ బాబు, షబ్బీర్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. మార్గ మధ్యలో క్యూఆర్టినే కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా  నాయకులు మాట్లాడుతూ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎక్కడ కించపరిచే విధంగా మాట్లాడలేదు కొంతమంది ఆకు రౌడీలు వక్రీకరిస్తూ దుష్ట ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు అడిగిన వాటికి సమాధానం చెప్పే కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల కు ఎంపీలకు దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం లబ్ధిదారుల ఎంపిక పనులు వాలంటరీలకు ఎలా అప్పగిస్తారని వ్యక్తిగత సమాచారం వారి చేతుల భద్రమేనా అని ఉద్యోగులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు వీటికి సమాధానం చెప్పలేక ఆయన పైన ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు. వాలంటరీలు అంటే మాకు కూడా గౌరవం ఉంది కానీ అందులో కొంతమంది మాత్రమే తప్పుదారిలో వెళ్తున్నారని దాన్ని సరి చేసుకోమని మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ మెంబర్ హసీనా బేగం అనిత శ్రీ నాయకులు కొండల్ ,నాగరాజు, నవీన్ రెడ్డి, నల్లమల్ల రవి, నరసింహ రామ్మోహన్, బాలు తదితరులు పాల్గొన్నారు.

About Author