దళితవాడలకు ప్రత్యేక పంచాయితీ…
1 min read– పీవీ సునీల్ కుమార్ ను కలిసిన దళిత నాయకులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నేటి సమాజంలో దినదినాభివృద్ధికి అభివృద్ధి చెందుతున్న తరుణంలో దళితులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని కోరుతూ పీవీ సునీల్ కుమార్ గారికి నందికొట్కూరు దళిత నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.మా దళితవాడను మేమే పాలించుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ &అంబేద్కర్ ఇండియన్ మిషన్(ఏఐఎం) వ్యవస్థాపకులు పివి.సునీల్ కుమార్ గారు శుక్రవారం నంద్యాలకు వచ్చిన సందర్భంగా నందికొట్కూరు దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులు నంద్యాలలో పివి.సునీల్ కుమార్ గారిని ప్రత్యేక భవనంలో కలిసి దళితుల సమస్యలపై ఆయనతో మాట్లాడారు.జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మాల మహానాడు తాలూకా అధ్యక్షులు నాగేష్,మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు తదితర దళితుల సమస్యలపై మాట్లాడినట్లు అదే విధంగా నందికొట్కూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నాగేష్ మరియు డాక్టర్ రాజు తెలిపారు.అలాగే దళితుల అభ్యున్నతి కోసం ఎందా కైనా పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు దేవ సహాయం,పరుశురాముడు,సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.